టాలీవుడ్ కింగ్ నాగార్జున తన చివరి సినిమా నా సామిరంగ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేయడంలో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ లోగా ఆయన కోలీవుడ్‌లో కూలీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. లోకేష్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే, ఇందులో నాగార్జున పాత్రపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
అంతేకాకుండా, ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర లోనూ నాగార్జున ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. కథకు మలుపు తిప్పే పాత్ర కాబట్టే ఆయన ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే తమిళంలో వరుసగా రెండు సినిమాలు చేస్తోన్న నాగార్జున, తెలుగులో మాత్రం కొత్త ప్రాజెక్ట్‌ను ఇంకా అనౌన్స్ చేయలేదు. సీనియర్ హీరో అయినప్పటికీ, కథల ఎంపికలో ఆలస్యం చేయడం అభిమానుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.
అక్కినేని అభిమానుల నిరాశ
ఒకవైపు అఖిల్ ఏజెంట్ సినిమా విడుదలై రెండేళ్లు గడుస్తున్నా, ఇంకా కొత్త సినిమా ప్రకటన చేయలేదు. ఇప్పుడు నాగార్జున కూడా అదే విధంగా సినిమాల విషయంలో ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు, నాగ చైతన్య మాత్రం తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరి, అక్కినేని అభిమానుల్లో జోష్ నింపాడు.
ఇదే సమయంలో, నాగార్జున తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు దర్శకులతో కథా చర్చలు జరిగినప్పటికీ, ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. అయితే ఈసారి నాగార్జున ఒక్కసారి సినిమా చేయాలి అంటే పెద్ద హిట్ కొట్టాలనే స్ట్రాటజీతో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి నాగార్జున, అఖిల్ తమ స్పీడ్ పెంచి వరుస సినిమాలు చేస్తే, అక్కినేని ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. మరి నాగార్జున ఎప్పుడు తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారో చూడాలి!
Recent Random Post: