
టెలివిజన్ స్టార్ శ్వేతా తివారీ నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పాలక్ తివారీ ప్రస్తుతం సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. తన అందం, స్టైల్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై చేసిన వ్యాఖ్యలు నెటిజన్లలో ఆసక్తి రేపాయి.
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలక్ తివారీ తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని ఆమె స్పష్టంగా తెలిపారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారని గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఇద్దరూ కలిసి కనిపించినప్పటికీ, పాలక్ మాత్రం ఆ వార్తలను ఖండిస్తూ తనకు ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌షిప్ లేదని చెప్పడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆమె చేసిన “సింగిల్” కామెంట్‌పై సోషల్ మీడియా సెలబ్రిటీ ఓరీ స్పందించడం మరింత చర్చకు దారితీసింది. ఆమె వీడియోపై ఆయన “ఆమె సింగిలా?” అంటూ కామెంట్ చేయడం వైరల్‌గా మారింది. గతంలో పాలక్–ఓరీ మధ్య జరిగిన చాట్స్ లీక్ వివాదం కూడా గుర్తు చేసుకుంటూ నెటిజన్లు మళ్లీ ఈ విషయంపై చర్చ ప్రారంభించారు.
ఇంటర్వ్యూలో పాలక్ తన టీనేజ్ రోజుల్లో జరిగిన సరదా సంఘటనలు, మాజీ ప్రియుడితో ఉన్న చిన్న గొడవలు వంటి విషయాలను కూడా పంచుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితం కంటే రిలేషన్‌షిప్ గాసిప్స్‌పైనే ఎక్కువ దృష్టి పడుతోంది.
వర్క్ ఫ్రంట్‌లో పాలక్ తివారీ నటించిన “లుఖే” వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఆమెకు నటనకు మంచి అవకాశం ఉన్న పాత్ర దక్కిందని తెలుస్తోంది. శ్వేతా తివారీ మాదిరిగానే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని పాలక్ ప్రయత్నిస్తోంది.
ఇక గతంలోనే ఒక ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా భారీ బడ్జెట్ చిత్రంతో తెలుగు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. టాలీవుడ్‌లో అడుగుపెట్టే అవకాశం కోసం పాలక్ ఎదురు చూస్తోందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
Recent Random Post:















