మహేష్ బాబు – రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 భారీగా ముందుకు

Share


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎస్ఎస్ఎంబీ29పై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వేదిక వరకు చేర్చిన రాజమౌళి, ఈ చిత్రాన్ని దానిని మించిపోే రీతిలో తెరకెక్కించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా నిశ్శబ్దంగా సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ షెడ్యూల్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేసిన రాజమౌళి, ఇందులో మహేష్ బాబు – ప్రియాంక చోప్రాలపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ దక్షిణాఫ్రికా షెడ్యూల్ పూర్తయ్యాక యూనిట్ తిరిగి హైదరాబాద్‌కి రానుంది.

ఇక మేకర్స్ తాజాగా “గ్లోబ్ ట్రోటర్” హ్యాష్‌ట్యాగ్‌తో ఒక స్టిల్ విడుదల చేసి, నవంబర్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. భారీ సెట్స్ కోసం రాజమౌళి ఖర్చుకు వెనుకాడడం లేదని ఇండస్ట్రీ టాక్.

ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె. ఎల్. నారాయణ విశాలమైన బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


Recent Random Post: