సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైన రంభ!

Share


90వ దశకంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో రంభ ఒకరు. దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఆమె, గ్లామర్ రోల్స్‌తో పాటు తన ప్రత్యేకమైన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. మహా సముద్రం సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ ఎంత క్రేజ్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు.

తెలుగు మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, బెంగాళీ, భోజ్‌పురి సినిమాల్లో కూడా రంభ తన ముద్ర వేసింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. కానీ ఇప్పుడు రంభ రెండో ఇన్నింగ్స్‌కి సిద్ధమవుతోందని సమాచారం.

90ల తారలందరూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ సమయంలో, రంభ కూడా తన సినీ కెరీర్‌ను రీస్టార్ట్ చేయాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే, సాధారణ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంపిక చేసుకుంటానని ఆమె చెబుతోంది. అంతేకాదు, ఒకటి కాదు, ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్‌కు అయినా రెడీ అంటూ సైన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెబుతోంది.

ఈ నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత కలైపులి థాను రంభ రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన, “రంభ తన రీ ఎంట్రీ కోసం నన్ను సంప్రదించింది. మంచి ప్రాజెక్ట్ ఉంటే నేను ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాను” అని పేర్కొన్నారు.

తెలుగులో ‘ఆక్కోటి అడక్కు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రంభ, చివరగా ‘దొంగ సచ్చినోళ్లు’ సినిమాలో నటించింది. తమిళంలో ఆమె చివరి సినిమా ‘పెన్ సింగం’ (2010). సినిమాలకు దూరమైనప్పటికీ, టీవీ షోలు, జడ్జ్‌గా కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది.

ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న రంభ కోసం దర్శకులు ఎలా ప్లాన్ చేస్తారో, ఏ విధమైన పాత్రలు రాస్తారో చూడాలి. రంభ సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎవరు క్యాష్ చేసుకుంటారో, ఏ దర్శకుడు ఆమెకు పర్‌ఫెక్ట్ రీ ఎంట్రీ మూవీ అందిస్తారో ఆసక్తిగా మారింది.


Recent Random Post: