సెకెండ్ సింగిల్ తోనైనా ఊపుతారా?

Share


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న పీరియాడిక్ చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఇప్పుడు లిరిక‌ల్ సింగిల్స్‌తో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వయంగా ఆలపించిన “మాట వినాలి” పాటను రిలీజ్ చేశారు. కానీ ఈ పాట మాత్రం శ్రోతల మద్దతు లేకుండా పోయింది. అభిమానులు, అలాగే నెట్‌జనాలూ పాటపై నిప్పులు ప‌ట్టించారు. పాట నెమ్మ‌దిగా సాగ‌డం, ఎక్స్‌ప్రెష‌న్స్ సరిగ్గా కనపడకపోవడం వంటి విమర్శలు వచ్చాయి. ఈ పాటతో అంచనాలు పెరిగాయి, కానీ అది ప‌ట్ట‌కుండా పోయింది.

అయితే, ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న చిత్రానికి రెండో సింగిల్ రిలీజ్ చేసే ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ సింగిల్ కూడా జాన‌ప‌ద‌మైనద‌ని చెబుతున్నారు. ఈ పాటలో నిధి అగ‌ర్వాల్ పాత్ర కూడా ఉంటుంద‌నే ఊహ‌లు వ‌స్తున్నాయి. నిధి పాత్ర‌కు సంబంధించిన లుక్, సమాచారాన్ని ఈ పాట ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నారు. అలాగే, కీరవాణి సంగీతంలో ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. ప‌వ‌న్ అభిమానులు బాహుబ‌లి వంటి హిట్స్‌లా పాటలు ఉండాలని కోరుకుంటున్నారు. మొదటి సింగిల్ నిరుత్సాహాన్ని ఇస్తే, రెండవ సింగిల్‌తో ఆ ఊపు పునరుద్ధరించగలరేమో చూడాలి.

ఇక, చిత్ర షూటింగ్ దశలో ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ చేస్తే, అత‌డి పోర్ష‌న్ పూర్తి అవుతుంది. బ్యాలెన్స్ షూట్ ఫిబ్రవరి చివర్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మార్చిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Recent Random Post: