
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప చిత్రం టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తోంది. మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 200 కోట్ల వ్యయంతో రూపొందుతోంది. ఇంత వరకూ మోహన్ బాబు తన బ్యానర్‌లో ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించలేదు. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు భాగమయ్యారు.
ఇందులో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ చిత్రంలో నటించడానికి అక్షయ్ మొదట్లో ఆసక్తి చూపలేదని, నో చెప్పాడని ఇటీవలే విష్ణు వెల్లడించారు. సినిమా కథ చెప్పినప్పుడల్లా అక్షయ్ కుమార్ నిరాకరించాడని, ఒకసారి కాదు, రెండు సార్లు మర్చిపోవాలంటూ స్పష్టంగా చెప్పాడని విష్ణు తెలిపారు. కానీ, ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సూచనతో చివరికి అక్షయ్ ఒప్పుకున్నాడని విష్ణు వెల్లడించాడు.
అక్షయ్ మొదట్లో ఎందుకు నో చెప్పాడు? బాలీవుడ్ డైరెక్టర్ చెప్పగానే ఒప్పుకోవడానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలను విష్ణు మాత్రం బయటపెట్టలేదు. అయితే, ఈ తరం ప్రేక్షకులకు శివుడిగా అక్షయ్‌ను చూపించాలన్న తన పట్టుదల కారణంగా చివరికి ఆయనను ఒప్పించగలిగినట్టు విష్ణు చెప్పాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో విష్ణు నటించిన శివభక్తుడి పాత్రకు సంబంధించిన ఒక పాట కూడా వైరల్ అవుతోంది. అక్షయ్ కుమార్ శివుడిగా ఎలా కనిపించబోతున్నాడన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.
Recent Random Post:














