
ప్రభాస్‌తో రూపొందుతున్న భారీ సినిమా రాజా సాబ్ తర్వాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరో పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతోంది. తేజ సజ్జా హీరోగా చేసిన మిరాయ్తో జాతీయ స్థాయిలో విజయం సాధించిన ఈ సంస్థ ఇప్పుడు మరింత అంబిషన్‌తో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా గూఢచారి 2 చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా, తాజాగా మరో భారీ సినిమాకు ప్లాన్ వేసింది.
ఈ కొత్త ప్రాజెక్ట్ టాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్ల కలయికలో తెరకెక్కనుందట. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బావమరిది, అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ ఇందులో కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది.
సోషల్ మీడియాలో వారు పేర్కొంటూ —
“ప్రతిభావంతుడైన ఆయుష్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు మా పీపుల్స్ మీడియా కుటుంబంలో చేరడం చాలా ఆనందంగా ఉంది” అని వెల్లడించారు.
దీనిపై ఆయుష్ శర్మ స్పందిస్తూ,
“ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో జట్టుకట్టడం నాకు గౌరవంగా ఉంది. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు ఎల్లప్పుడూ సినిమాటిక్ ట్రీట్‌లా ఉంటాయి. భారతీయ సినిమా హద్దులను దాటి నిలిచిన నిర్మాణ సంస్థల్లో ఇది ఒకటి అని నమ్ముతున్నాను” అన్నారు.
ఆయుష్ శర్మ చివరిసారిగా 2024 ఏప్రిల్‌లో విడుదలైన రుస్లాన్ చిత్రంలో కనిపించారు. అంతకుముందు 2021లో యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్లో నటించారు. 2018లో సల్మాన్ ఖాన్ నిర్మించిన లవ్ యాత్రితో కథానాయకుడిగా తన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం ఆయుష్ క్వాతా మరియు మై పంజాబీ నికాహ్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటం ఆయుష్‌కి కొత్త మైలురాయిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా హిందీ నటులలో తెలుగు సినిమాల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో కూడా మరోసారి స్పష్టమవుతోంది.
Recent Random Post:














