పూనమ్ కౌర్, త్రివిక్రమ్ పై నేరుగా ఆరోపణలు

Share


నటి పూనమ్ కౌర్ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా, ఈ ఇష్యూ కొన్నేళ్లుగా హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ తరచుగా త్రివిక్రమ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్లు చేస్తూ ఉంటుంది. కొంతకాలంగా అయితే ఆమె నేరుగా త్రివిక్రమ్ పేరు తీసుకుని ట్వీట్లు చేయడం మొదలుపెట్టింది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్టు ఆ మధ్య ప్రకటించినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై శివ బాలాజీ స్పందిస్తూ, తమకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటే తక్షణమే తమకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.

కానీ పూనమ్ ఇప్పటివరకు త్రివిక్రమ్ వల్ల తనకు జరిగిందనుకున్న అన్యాయాన్ని బయట పెట్టలేదు. తాజాగా, ఆ విషయంలో మళ్లీ వ్యాఖ్యలు చేస్తూ, తాను త్రివిక్రమ్ కారణంగా సినిమాలకు దూరమయ్యానని పరోక్షంగా ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ కూడా “జై బాలయ్య” అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే, ఒక నెటిజన్ ఆమెకు “ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారని?” అని ప్రశ్నించారు.

దీంతో పూనమ్ కౌర్, “అప్పట్లో నేను సినిమాలు చేసేదాన్ని, కానీ త్రివిక్రమ్ మరియు కొన్ని గ్రూప్స్ కారణంగా నేను అన్నీ ఆపేసుకున్నాను” అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఇష్యూ ఏంటో అడుగుతున్నారు, అలాగే ఇలా పోస్టులు పెడితే ఏం ప్రయోజనం ఉన్నదని ప్రశ్నిస్తున్నారు.

పూనమ్ కౌర్ గతంలో వరుస సినిమాలతో బిజీగా గడిపిన నటి. మాయాజాలం మూవీతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి, తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత శౌర్యం, నిక్కీ అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి అనేక సినిమాల్లో నటించింది. చివరగా నాతిచరామి చిత్రంలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.


Recent Random Post: