‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్‌పై హిట్.. యూత్ ఆడియన్స్‌కు ఫస్ట్ ఛాయిస్!

Share


బడ్జెట్, కాస్టింగ్ పరంగా ఇతర చిత్రాలతో పోలిస్తే చిన్న సినిమాగా కనిపించినా.. క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్, వసూళ్ల విషయంలో ‘మ్యాడ్ స్క్వేర్’ తనదైన ముద్ర వేసుకుంది. తొలి రోజే ప్యాక్డ్ హౌస్‌లతో స్టార్ట్ అయిన ఈ చిత్రం, టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధించింది.

‘మ్యాడ్’తో పోలిస్తే ‘మ్యాడ్ స్క్వేర్’ కంటెంట్ పరంగా బలంగా లేకపోయినా.. కామెడీ అంతగా ఆర్గానిక్‌గా అనిపించకపోయినా.. పాటలు ఆకట్టుకోకపోయినా.. ఈ ప్రతికూలతలు వసూళ్లపై ప్రభావం చూపించలేదు. మౌత్ టాక్ సగటుగా ఉన్నా, సినిమా యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకర్షించింది.

తొలి వారాంతంలోనే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే, ఈ ఫిగర్లు కొద్దిగా ఎగ్జాజరేషన్ అయ్యుండొచ్చు కానీ, రూ.40 కోట్లకు తగ్గకుండా గ్రాస్ సాధించడం మాత్రం నిజమే. ఈ స్థాయిలో వచ్చిన కలెక్షన్లు ‘మ్యాడ్ స్క్వేర్’కి సూపర్ సక్సెస్‌గా నిలిచాయి.

ఇదే సమయంలో రిలీజ్ అయిన మోహన్‌లాల్ ‘ఎంపురాన్’ మొదట హైప్ తీసుకువచ్చినా, తొలి రోజు తర్వాత ఆ సినిమా జోరు తగ్గిపోయింది. విక్రమ్ ‘వీర ధీర శూర’ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నప్పటికీ సరైన పబ్లిసిటీ లేక పోయింది. నితిన్ ‘రాబిన్ హుడ్’కు నెగటివ్ టాక్ రావడం వల్ల ఆ సినిమాకు ఊపు తగ్గింది.

ఈ పోటీని పూర్తిగా ఉపయోగించుకుని ‘మ్యాడ్ స్క్వేర్’ యూత్ ప్రేక్షకుల మొదటి ఛాయిస్‌గా నిలిచింది. వీకెండ్‌లో హౌస్ ఫుల్ షోలతో దూసుకెళ్లింది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేరుకుని, సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. ‘మ్యాడ్’ ఫ్రాంచైజీకి మంచి బలాన్నిచ్చిన ఈ చిత్రం, యూత్ ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించిందో మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది!


Recent Random Post: