లోకేశ్ ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం


వైసీపీ ప్రభుత్వం తరుపున జగన్ గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు విద్యార్థులకు అనేక ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రకటించి గొప్పలు చెప్పుకొన్న సంగతి తెలిసిందే. కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారని చాలా మంది తెలుసు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక “అమ్మఒడి” పథకం తీసుకురావడమే మంచిది అని భావించి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపేశారు. ఆ సమయంలో ఆ పథకం రద్దు చేయడం పై తీవ్ర విమర్శలు విన్నాయి.

ఇప్పుడు, యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ ను విద్యార్థులు “మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించండి” అని కోరగా, లోకేశ్ వారి అభ్యర్థన మేరకు ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “విద్యా వ్యవస్థతో రాజకీయాలను ముడిపెట్టవద్దని” సూచించారు. ఆయన మాట్లాడుతూ, “ఈ కార్యక్రమంలో ఫ్లెక్సీల్లో తమ ఫోటోలు లేకుండా, తమ పార్టీ రంగులు లేకుండా, విద్యార్థుల పథకాలలో వ్యక్తిగత స్థాయిలో మాన్యులు పేర్లు పెట్టడం జరిగింది,” అని పేర్కొన్నారు.

ఇక, స్కూల్స్ మరియు కాలేజీలలో జాబ్ మేళాలు తప్ప మరే ఇతర కార్యక్రమాలు జరగకుండా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, టీచర్లపై యాప్ లభారం తగ్గించమని కూడా చెప్పారు. విద్యార్థులను గౌరవంగా చూసుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రైవేట్ విద్యాసంస్థలతో సమానంగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ పథకం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు అవుతోంది. ఈ ఏడాది ₹29.39 కోట్ల నిధులు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ₹85.84 కోట్ల నిధులు కేటాయించారు. జగన్ మామయ్య సున్నం పెడితే, లోకేశ్ అన్నం పెట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Recent Random Post: