ఈటల రాజేందర్ అటవీ శాఖ షాక్..! చెట్లు నరికారంటూ నోటీసులు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త సమస్య వచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన జమున హెచరీస్‌కు తెలంగాణ అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. జమున హెచరీస్‌కు రోడ్డు వేసేందుకు అనుమతి లేకుండా సుమారు 237 చెట్లను నరికారని నిర్ధారిస్తూ నోటీసులు జారీ చేసింది. దానికి సమాధానం చెప్పాలని నోటిస్‌లో పేర్కొంది. సరైన సమాధానం రాకపోతే వాల్టా చట్టం క్రింద కేసులు పెడతామని నోటిసులో పేర్కోన్నారు.

వాల్టా చట్టం ప్రకారం నరికిన చెట్లకు రెట్టింపు చెట్లను నాటడడం.. నరికిన చెట్లకు విలువను కట్టాల్సి ఉంటుంది. మరోవైపు జమున హచరీస్ అటవీశాఖకు సంబంధించిన భూముల కబ్జా చేయలేదని అధికారులు తెలిపారు. హెచరీస్ కు వంద మీటర్లు దూరంలో అటవీ భూములు ఉన్నట్టు తెలిపింది. మరి చెట్లను నరికినందుకు ఎలాంటి కేసులు నమోదు చేస్తారో.. ఎంత జరిమానా విధిస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది.


Recent Random Post: