టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తననుద్దేశించి చేసిన ట్వీట్ పై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. చెత్త మనుషులకు చెత్త ఆలోచనలే ఉంటాయని ధ్వజమెత్తారు. అలాంటివాటిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. మంగళవారం మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ‘రస’కందాయంలో హంపి ’ధూమ్ ధామ్’.. కోవర్డ్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా..? అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశించే ఆయన ఆ ట్వీట్ చేశారని చర్చ సాగింది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి జగదీశ్ స్పందించారు. అలాంటి చెత్త విషయాలపై తాను స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
Posted inTelugu - Featured Telugu - Political News
