
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన సునీల్ శెట్టి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా సినిమాల్లో కనిపిస్తూ ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన ఒక పాడ్ క్యాస్ట్ లో తన ఫ్యామిలీ గురించి, తన అల్లుడు కేఎల్ రాహుల్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నేను నటించే సినిమాలతో పాటు చాలా విషయాల గురించి మేము అంతా కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. మా గురించి జరిగే ప్రచారం మొదలుకుని ఇతర విషయాలు అన్నింటిని కూడా మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం.
నా అల్లుడు కేఎల్ రాహుల్ ఆట పై చాలా సార్లు విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు రాహుల్ బ్యాట్ తో సమాధానం చెప్పేవాడు. కానీ నేను మాత్రం అతడిపై విమర్శలు వచ్చిన సమయంలో చాలా బాధపడేవాడిని. రాహుల్ మరియు నా కూతురు కంటే కూడా ఎక్కువగా నేను ఆ విమర్శలకు ఫీల్ అయ్యేవాడిని అంటూ సునీల్ శెట్టి చెప్పుకొచ్చాడు.
సునీల్ శెట్టి తెలుగు లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించాడు. అయితే కమర్షియల్ గా ఒక బిగ్ బ్రేక్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. తమిళ్ మరియు ఇతర సౌత్ భాషల్లో కూడా మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధం అంటూ గతంలో పలు ఇంటర్వ్యూల్లో సునీల్ శెట్టి పేర్కొన్నాడు.
























కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు! | KTR Key comments on Congress government
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు! | KTR Key comments on Congress government