మేము ఎంత కష్టపడుతున్నామో మీకేం తెలుసు.. | Bithiri Sathi
మ్యాడ్.. రోజురోజుకు మరింత స్ట్రాంగ్

యూత్ ఫుల్ ఎంటర్టైలర్ గా గత శుక్రవారం విడుదలైన మ్యాడ్ సినిమా మొదటి రోజే చాలా పాజిటివ్ టాక్ అందుకుంది. మిగతా సినిమాలు కూడా పోటీగా ఉన్నప్పటికీ మ్యాడ్ కామెడీ యాంగిల్ లో బాగా అట్రాక్ట్ చేయడంతో ఓ వర్గం ఆడియన్స్ ఇటువైపు ఎక్కువగా యూటర్న్ తీసుకున్నారు. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కామెడీ సినిమా రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ హీరోలుగా పరిచయమయ్యారు. ఇక సీతార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశం నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా చూస్తూ ఎవరైనా నవ్వుకోకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను అంటూ నిర్మాత ఛాలెంజ్ చేసిన తీరు అందరిని బాగా ఎట్రాక్ట్ చేసింది.
దీంతో సినిమా పై కొంత పాజిటివ్ వెబ్ కూడా అప్పుడే పెరిగింది. అయితే నాగ వంశీ నమ్మినట్లుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా మళ్లీ రెండో రోజు కంటే ఎక్కువగా మూడవరోజు రాబట్టింది.
ఇక ఈ మూడు రోజుల్లో కలుపుకొని మ్యాడ్ సినిమాకు 8.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. చిన్న బడ్జెట్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని నిర్మాతలకు వెనక్కి తెచ్చేసింది. ఇక మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రావడం తో ఈ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలుకానుంది. వీకెండ్ లో ఎలాగు మంచి టాక్ తోటి బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. ఇక సోమవారం నుంచి అసలు గేమ్ స్టార్ట్ కానుంది. దసరా వరకు పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కావు కాబట్టి మరింత పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకుపోతే నిర్మాత జాక్ పాట్ కొట్టేసినట్లే.
మాస్ రాజా టైగర్‌ని అక్కడ తొక్కేసే కుట్ర జరుగుతోందా?

సినిమాలకు తెలుగు ప్రేక్షకులు మహారాజ పోషకులు అన్నది ప్రతి సందర్భంలోనూ నిరూపించబడింది. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా?..మళ్ళీ భారతీయ సినిమాకు మునుపటి రోజులు వస్తాయా? అని మేకర్స్, స్టార్స్ భయంతో ఆందోళన చెందుతున్న వేళ తెలుగు ప్రేక్షకులు మీకు మేమున్నాం అంటూ థియేటర్లకు వచ్చారు. మేకర్స్‌లో ఉన్న భయాలని పటాపంచలు చేసి భారతీయ సినిమాకు మేమున్నామంటూ అభయాన్నిచ్చారు. ఆ తరువాతే ఇతర భాషల్లో సినిమాల విషయంలో పరిస్థితులు చక్కబడ్డాయి.
తెలుగు ప్రేక్షకులని ఆదర్శింగా తీసుకుని అన్ని భాషల ప్రేక్షకులు సినిమా పరిశ్రమకు అండగా నిలవడంతో మళ్లీ పరిస్థితులు యదాస్థితికి వచ్చేశాయి. ఇంతగా ఇండియన్ సినిమాకు నూతన జవసత్వాలతో పాటు అభయ హస్తాన్ని అందించిన తెలుగు వారి పట్ల, తెలుగు సినిమాల పట్ల ఇప్పటికీ ఓ స్టేట్‌లో వివక్ష కొనసాగుతూనే ఉంది. అది మరెక్కడో కాదు తమిళనాట. తమిళ స్టార్లు నటించిన సినిమాలపై మన తెలుగు ప్రేక్షకులు ఎలాంటి వివక్షను ప్రదర్శించకుండా బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతూ కాసుల వర్షం కురిపిస్తున్నారు.
కానీ అక్కడ మాత్రం మన సినిమాలకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. కనీసం థియేటర్లు కూడా లభించని విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయంటే తెలుగు సినిమాకు తమిళనాట ఏ స్థాయిలో అవమానం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు అని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి. పేరు కూడా తెలియని పర భాషా హీరోల సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే మన వాళ్ల సినిమాలపై మాత్రం తమిళ ఇండస్ట్రీలో వివక్ష కొనసాగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష సాక్షిగా మాస్ మహారాజా రవితేజ నటించిన పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.
రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన బయోపిక్ ఇది. దీన్ని పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలో భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ రవితేజ కెరీర్‌లోనే భారీ స్థాయిలో అక్కడ రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లు కూడా భారీ స్థాయిలో సెట్ అయ్యాయి. అయితే తమిళనాట మాత్రం టైగర్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. ఓ మోస్తారు స్థాయిలో కూడా అక్కడ టైగర్‌కు థియేటర్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు.
అక్కడ పెద్ద సంస్థలు టైగర్ రిలీజ్‌కు ముందుకు రాకపోవడమే అక్కడ ప్రధాన సమస్యగా మారింది. తెలుగు సినిమాకు మించి తమిళ సినిమాకే అక్కడి వారు ప్రాధాన్యతనివ్వడంతో టైగర్‌కు అక్కడ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. టైగర్ రిలీజ్ సమయంలోనే దళపతి విజయ్ – లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’ రిలీజ్ కాబోతోంది. దీంతో అక్కడి థియేటర్లన్నీ ‘లియో’కే కేటాయించారు. దీంతో ‘టైగర్ నాగేశ్వరరావు’కు థియేటర్ల సమస్య ఏర్పడింది. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే అక్కడ ఉదయనిధి స్టాలిన్ లాంటి వారు కానీ, లైకా వారు కానీ పూనుకోవాల్సిందే. కానీ ఆ పరిస్థితులు మాత్రం కనిపించకపోవడంతో మాస్‌రాజా అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
ఆ హీరోకి నయనతార నో చెప్పిందా!

‘జవాన్’ సక్సెస్ తో నయనతార రేంజ్ బాలీవుడ్ కి తాకింది. ఇప్పుడు అక్కడ స్టార్ హీరోలు సైతం నయన్ తో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అమ్మడు పారితోషికం కూడా భారీగా పెంచినట్లు వార్తలొస్తు న్నాయి. సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్…హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ సరసన కనిపించిందంటే? ఇక నయన్ ని పట్టుకోవడం దాదాపు అసాధ్యమే. బాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా! నయన్ స్థానం ప్రత్యేకంగా ఉంటుంది.
అమెకి ఆమె పోటీ తప్ప ఇతరులు పోటీ కాదనేలా దూసుకుపోతుంది. టాలీవుడ్ లోనే చాలా రేర్ గానే కమిట్ అవుతుందంటే? సౌత్ లో నయనతార డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో గెస్ చేయోచ్చు. అయితే కోలీవుడ్ లో మాత్రం తూచ తప్పకుండా సినిమాలు చేస్తోంది. కమర్శియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లారెన్స్ సరసన ఓ సినిమాకి సంతకం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
రత్న కుమార్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి నయనతార ఎగ్జిట్ అయినట్లు సమాచారం. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు సర్దుబాటు చేయడం కుదరక తప్పుకు న్నట్లు వినిపిస్తుంది. అలాగే నిర్మాత నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేసిందిట. తమ బ్యానర్లో ఎలాంటి సినిమా కమిట్ అవ్వలేదని వాళ్ల నుంచి మాట అడిగిందిట.
అందుకు వారు కూడా అంగీకారం చెప్పినట్లు సమాచారం. మరి నయనతార నిజంగా డేట్లు సర్దుబాటు చేయలేక తప్పుకుందా? ఇంకేదైనా కారణం ఉందా? అంటే మరో బలమైన రీజన్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు తాను ఉన్న పోజిషన్ లో లారెన్స్ తో సినిమా చేయడం కరెక్ట్ కాదని నయన్ కి బాగా సన్నిహితంగా ఉండేవారు నూరుపోయడంతోనే ఆమె ఎగ్జిట్ అయినట్లు కోలీవుడ్ మీడియాలో కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. అలాకాకుంటే హీరో తెలియకుండానే అడ్వాన్స్ తీసుకుంటుందా? తమ బ్యానర్లో సినిమా కమిట్ అవ్వలేదన్న మాట ఎందుకు తీసుకుంది? అనే వాదన వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవాలు ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది.
Why Security Cover Was Granted To Shah Rukh Khan?

Shah Rukh Khan is a name that needs no introduction. He is one of the top stars in the country and enjoys an unmatched following. His charisma is such that even a few Hollywood stars admire him. This speaks volumes about his stardom and massive popularity outside India.
Now King Khan is in the news for an unwanted reason. The media reports say that Shah Rukh Khan received threats which made him reach the state government for security. Following this, the government is said to have granted a security cover of Y+.
Shah Rukh Khan is banking high on the success of Pathaan and Jawan. Following the success of both films, the star is said to be receiving threats. When the actor approached the government on the threats, a security cover was granted to him.
Media reports say that the actor had taken the issue to the notice of the Maharashtra government saying that a few threats were issued. Looking into this a security cover was granted to the actor.
Y+ security cover is one of the biggest security covers and under the category armed security will be [protecting the star. He is not the first one in the Bollywood industry to get the security cover.
Elegance and Vibrance: Alia Bhatt’s Stunning Style

Alia Bhatt, who recently achieved great success alongside co-star Ranveer Singh in the movie “Rocky and Rani Ki Prem Kahani,” directed by Karan Johar, is now on the cover of a popular magazine, stunning everyone. She also gained attention from the Tollywood audience through “RRR” and “Brahmastra.”
To delight her fans, Alia recently shared captivating photos from her VOGUE magazine cover shoot. In each picture, she effortlessly displays her versatility and natural charm. Whether it’s her elegant monochrome outfits or vibrant casual attire, Alia looks fabulous in every shot. Her portrait photos, taken with great skill, truly showcase her beauty and charisma. It’s clear that she can smoothly switch between different styles, leaving a lasting impression.
Currently, Alia Bhatt is not only busy with her acting career but has also started producing films. She is actively working on “Jigra,” a project that adds to her impressive career. As she continues to capture hearts on and off the screen, Alia’s journey in the film industry is truly remarkable.

















