మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయి రెండేళ్ళు పూర్తయినా, ఇంకా ఈ కేసులో దోషులెవరో తేలలేదు. సీబీఐ, ఇటీవల పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ కేసు విచారణ విషయమై రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన రీతిలో చర్చలు షురూ అయ్యాయి. గతంలో సీబీఐ, ఈ కేసుని విచారిస్తున్న సమయంలో.. సునీల్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు పరార్ అయ్యారు.
అయితే, సీబీఐ వేధింపులు తట్టుకోలేక సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికే గోవా వెళ్ళినట్లు సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులిపుడు చెబుతుండడం గమనార్హం. సీబీఐ, సునీల్ యాదవ్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిందనీ, ఈ విషయమై హైకోర్టును కూడా ఆశ్రయించామనీ, సీబీఐ అమ్ముడుపోవడం వల్లే, ఏ సంబంధం లేని సునీల్ యాదవ్ మీద కేసులు బనాయించిందని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వివేకా కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేసిన 11 నుంచి 15 మందిలో తన కుమారుడు సునీల్ యాదవ్ పేరు లేదని సునీల్ యాదవ్ తండ్రి చెబుతుండడం మరో ఆసక్తికర అంశం. ‘హంతకులెవరో పులివెందులలో అందరికీ తెలుసు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, వైసీపీ నేతలందరికీ తెలుసు. పెద్దవాళ్ళు తప్పించుకునేందుకే సునీల్ మీదకి కేసు మారేలా ప్లాన్ చేశారు..’ అన్నది సునీల్ యాదవ్ కుటుంబ సభ్యుల వాదన.
ఇలాంటి కేసుల్లో ఇలాంటి ఆరోపణలు సహజాతి సహజం. రెండేళ్ళ తర్వాత వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. అని సునీల్ యాదవ్ అరెస్టుపై ప్రచారం జరుగుతున్న సమయంలో, సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి సరికొత్త ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరమే. పైగా, వైఎస్ వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం మూడు రోజుల నుంచి సీబీఐ అన్వేషిస్తోంది.. అదీ సునీల్ ఇచ్చిన సమాచారంతో. కానీ, ఆయుధాలు దొరకలేదాయె.
ఏమో, ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోగానీ, ఓ మాజీ మంత్రి.. మాజీ ఎంపీ హత్య కేసులో నిజాలు వెలుగుచూడ్డానికి ఇంత సమయమా.? వ్యవస్థలెంత అచేతనావస్థలో వున్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?










As a piece of good news to Rebel YSRCP MP Raghurama Krishnam Raju, the Union Government has written to the Andhra Pradesh government directing it to take action against Andhra Pradesh CID chief Sunil Kumar.
Bollywood actor Lara Dutta who caught everyone’s attention with her unbelievable transformation as former Prime Minister Indira Gandhi for Akshay Kumar starrer Bell Bottom has done it yet again.
బహుజన్ సమాజ్ పార్టీలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేరారు. ఈ మేరకు ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఛాలెంజ్ చేసేశారు ప్రవీణ్ కుమార్.. అదే వేదిక నుంచి.
What can make the political circles break their shells to figure out the reason better than leaders of two political parties coming together for a party.
Mahesh Babu is playing a full-on mass role in his upcoming action thriller, Sarkaru Vaari Paata, which is halfway through the shoot. The makers have announced that the film will be out in theaters next Sankranthi season. The film will be out in theaters on 13th January next year, as confirmed by the makers in the recently released first look poster of the film. Here comes an interesting update on Mahesh’s immediate next film after Sarkaru Vaari Paata i.e, SSMB28, a Trivikram directorial. The film might well be mounted on a pan-India level, as mentioned by Naga Vamsi who is co-producing SSMB28.
పుష్ప డ్యూయాలజీలో తొలి భాగం పుష్ప -1 చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని దసరా బరిలో రిలీజ్ చేయాలని పట్టుదలగా పని చేస్తున్నట్టు సమాచారం. ఇక డ్యూయాలజీలో రెండో భాగం కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కుతుంది. ఈలోగా సుకుమార్ వేరొక సినిమాని పూర్తి చేయాల్సి ఉంటుంది.
The Andhra Pradesh government on Monday took a key decision on the MANSAS Trust and Simhachalam land issue. The government has appointed Endowments Commissioner as nodal officer to provide the necessary support to the Vigilance and Enforcement Department, which is investigating the alleged irregularities in land issues pertaining to the MANSAS Trust.
We know that Macho star Gopichand and Tamannaah Batia have paired up together for a sports drama titled ‘Seetimaarr’. The film, which was scheduled to hit the screens in April, has been postponed due to the second wave of Covid-19.
As a piece of good news to Rebel YSRCP MP Raghurama Krishnam Raju, the Union Government has written to the Andhra Pradesh government directing it to take action against Andhra Pradesh CID chief Sunil Kumar.
Bollywood actress Shilpa Shetty Kundra and her mother Sunanda Shetty have been booked by the Uttar Pradesh Police in an alleged case of fraud in Lucknow.
చిలిపి అల్లరి కీర్తి.. మహేష్ పైనే ఏసేసిందిగా.. గత కొన్ని గంటలుగా యూత్ లో అదే డిస్కషన్. ఇంతకీ కీర్తి ఏం ఏసేసింది? అంటే అదిరిపోయే పంచ్ వేసింది. మహేష్ తో కలిసి `సర్కార్ వారి పాట` చిత్రంలో నటిస్తోంది కాబట్టి దగ్గరగా తననే చూస్తూ అలా ఉండిపోయినట్టుంది. ఇంతకీ ఇంతటి పాల బుగ్గల ఛామ్ ఎలా సాధ్యం బాబూ! అంటూ ఆరాలు తీస్తూనే రోజంతా గడిపేస్తోంది కీర్తి.




