విషయం ఇప్పుడు అధికారికం. తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచేది బీజేపీ అభ్యర్థి. మిత్రపక్షం జనసేన పార్టీ, బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తుంది. తిరుపతి ఉప ఎన్నిక నుంచి బీజేపీ ‘విజయపు నడక’ ప్రారంభమవుతుందని బీజేపీ చెబుతోంది. బీజేపీ జాతీయ స్థాయి నేత మురళీధరన్ ఈ ప్రకటన చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ స్థాయి నేత సునీల్ దేవధర్ ఈ రోజు సమావేశమయ్యారు.. తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. ఈ చర్చలు సత్ఫలితాన్నిచ్చాయనీ, బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించడానికి ఇరుపక్షాలూ అంగీకరించాయనీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రకటించేశారు.
ఇప్పుడంటే, ఇది అధికారిక ప్రకటన అయ్యిందిగానీ.. నిజానికి, తిరుపతి ఉప ఎన్నికలో నిలబడేది బీజేపీ అభ్యర్థేనని గతంలోనే అందరికీ తెలిసిపోయింది. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు.. ఇలా పలువురు బీజేపీ నేతలు గతంలోనే, తిరుపతి ఉప ఎన్నికపై స్పష్టత ఇచ్చారు.
అయితే, బీజేపీ అత్యుత్సాహం నేపథ్యంలో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసేసరికి, జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ‘జాతీయ నాయకత్వంతో మాట్లాడదాం..’ అని పార్టీ నేతలకు పవన్ నచ్చజెప్పారు. ఆ తర్వాత పలు మార్లు ఈ విషయమై రెండు పార్టీల మధ్యా చర్చలు జరిగాయి.
ఒక్కటి మాత్రం నిజం, పంచాయితీ ఎన్నికలో బాగానే ప్రభావం చూపిన జనసేనను కాదని.. బీజేపీనే బరిలోకి దిగడం ఖచ్చితంగా జనసేన శ్రేణుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. ‘జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోతే, ఎన్నికల్నే బహిష్కరిస్తామంటూ ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు అప్పట్లో ఓ సమావేశం పెట్టుకుని తీర్మానం చేసిన సంగతి తెల్సిందే. అయినాగానీ, బీజేపీ, జనసేనను పక్కన పెట్టడం ఆశ్చర్యకరం.
‘ఎవరు నిలబడినా, గెలిచే స్థాయిలో పోరాడాల్సిందే..’ అని జనసేనాని ఇటీవల వ్యాఖ్యానించిన దరిమిలా, బీజేపీ జాతీయ నాయకత్వం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వస్తుందా.? వైసీపీని ఓడించే స్థాయిలో బీజేపీ చిత్తశుద్ధి వుంటుందా.? వేచి చూడాల్సిందే.










The wealth of Prime Minister Narendra Modi’s beloved Gautam Adani, a prominent Indian businessman, has skyrocketed this year.
Ronnie Screwvala’s RSVP and Blue Monkey Films’ new flick, A Thursday, starring the gorgeous Yami Gautam in the lead, has started the shoot. Yami Gautam has bagged a grey role in the film ‘A Thursday‘ that is touted to be a psychological thriller. This movie will expose the failings of the society through the story of a middle-class teacher.
టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్ హీరోలందరితో హీరోయిన్ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ భూమిక చావ్లా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అలాంటి భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఈమె మొదటి సారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసేందుకు సిద్దం అయ్యింది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న బంగార్రాజు సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
The Andhra Pradesh state government, headed by CM YS Jagan Mohan Reddy, which is mostly dependent on loans, is facing a huge financial crisis. This is due to the various cash transfer schemes being introduced by Jagan in the name of ‘Navaratnalu’.
After the first song ‘Inkosaari Inkosaari’ was well received by the audience, the makers of Nani‘s upcoming film ‘Tuck Jagadish‘ have unveiled the second single ‘Kolo Kolanna Kolo’ today.









