విజయ్ దేవరకొండకు శౌర్యువ్ స్క్రిప్ట్ ఫిక్స్!

Share


ఇటీవ‌ల టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఒక‌రికి ప్లాన్ చేసిన సినిమా మ‌రోక‌రిలోకి మారిపోవ‌డం సాధార‌ణ‌మే అయిపోయింది. 2023లో హాయ్ నాన్న సినిమాతో టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన శౌర్యువ్, తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. క‌థ‌నం, ఎమోష‌న్స్ తో కూడిన న్యూట్రల్ న‌రేటివ్‌ను బాగా డెలివ‌ర్ చేసిన శౌర్యువ్ పై అంచ‌నాలు పెరిగిపోయాయి.

అందుకే హాయ్ నాన్న త‌ర్వాత శౌర్యువ్ ఏ హీరోతో సినిమా చేస్తాడా? అన్న‌ది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇందులో భాగంగా, ఎన్టీఆర్‌తో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా చేయాలనుకున్న శౌర్యువ్, బౌండ్రీ లైన్ రెడీ చేసి ఆయ‌న‌ను ఒప్పించేందుకు చాలానే ప్రయత్నించాడు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండ‌డంతో ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు.

దాంతో శౌర్యువ్ అదే స్క్రిప్ట్‌ను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండకు వినిపించాడ‌ట‌. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరితో కింగ్‌డమ్, తర్వాత రవికిరణ్ కోలా, రాహుల్ సాంకృత్యాన్ సినిమాలకు కమిట్ అయ్యాడు. కానీ ఆ ప్రాజెక్టుల తర్వాత శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయ‌ని ఇండస్ట్రీ టాక్. ఇదే తరహాలో గౌతమ్ తిన్ననూరి ఒకప్పుడు రామ్ చరణ్‌కి చెప్పిన కథను ఇప్పుడు విజయ్‌తో కింగ్‌డమ్గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శౌర్యువ్ ఎన్టీఆర్ కోసం రాసిన కథను విజయ్ అంగీకరించ‌డం విశేషం. ఇది అధికారికంగా ప్ర‌క‌ట‌న అయితే, మరో క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్‌లో సిద్ధమవుతుంది.


Recent Random Post: