అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడిగా మహాభారతం ప్రారంభం?

Share


బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి — ఇద్దరూ ‘మహాభారతం’ను తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌లుగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ ప్రకటనలొచ్చి ఏళ్లైనప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు. కానీ తాజాగా అమీర్ ఖాన్ మాత్రం రాజమౌళికి మించిన దూకుడును చూపిస్తున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ, తాను ‘మహాభారతం’పై సీరియస్‌గా పని చేస్తున్నానని వెల్లడించారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్ర తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, అదే పాత్రను తాను పోషించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఎంతో విస్తృతమైనదిగా ఉండే అవకాశం ఉన్నందున, దానిని సిరీస్‌లుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రైటింగ్ వర్క్ ప్రారంభమైందని, స్క్రిప్ట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఒకవేళ అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడిగా మహాభారతాన్ని తెరకెక్కిస్తే, ఇది భారత సినిమా చరిత్రలో ఓ కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది. మరి ఈ భారీ ప్రాజెక్ట్‌కి దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు ఎవరవుతారు? తదితర వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ సారి అమీర్ ఖాన్ మాటల దూకుడు చూస్తే, మహాభారతం పనులు వాస్తవంగా ఊపందుకున్నట్టు కనిపిస్తోంది.


Recent Random Post: