ఎస్‌ఎస్‌ఎంబీ 29: మహేష్-రాజమౌళి మూవీపై భారీ అంచనాలు!

Share


ఎస్‌ఎస్‌ఎంబీ 29 పై భారీ అంచనాలున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కథ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని టాక్. ఇందులో మహేష్ బాబు విభిన్నమైన పాత్రలో ఆకట్టుకుంటారని, రాజమౌళి మేకింగ్ ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయిని దాటి, పాన్-వరల్డ్ లెవెల్‌కి తీసుకెళ్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి వరకు రైటర్ విజయేంద్ర ప్రసాద్ మినహా ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. మహేష్, రాజమౌళి గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి అప్‌డేట్స్ చెప్పలేదు. అయితే తాజాగా మహేష్ సతీమణి నమ్రతను సినిమా గురించి మాట్లాడాల్సిందిగా కోరితే, ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘ప్రస్తుతం నిశ్శబ్దమే ఉత్తమ ఫార్ములా’’ అంటూ మిస్టీరియస్ రిప్లై ఇచ్చారు.

దీంతో ఈ సినిమాపై నమ్రతకు ఉన్న నమ్మకం స్పష్టమవుతోంది. సినిమా ప్రొమోషన్ విషయంలో మౌనం ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కానీ, అది ఒకేసారి బిగ్ బ్లాస్ట్ అవితే ఆ రిజల్ట్ ఊహించదగ్గ రీతిలో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఎంబీ 29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం విదేశాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య తారాగణంపై అక్కడ కొన్ని ప్రధానమైన సీన్లు తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా భాగమవుతుందా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కానీ, ఈ సినిమా గ్లోబల్ రేంజ్‌లో విడుదలవుతుందన్నది మాత్రం ఖాయం.


Recent Random Post: